పాక్ సైన్యానికి చైనా కరోనా టీకా!

ABN , First Publish Date - 2021-02-08T10:08:19+05:30 IST

దాయాది దేశం పాకిస్తాన్‌కు డ్రాగన్ కంట్రీ చైనా సాయం చేసింది. పాక్ సైన్యానికి కరోనా టీకా అందజేసింది. పాకిస్తాన్ మిలటరీకి చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నుంచి ఈ వ్యాక్సిన్ అందింది. ఈ విసయాన్ని చైనీస్ రక్షణ శాఖ ఆదివారం

పాక్ సైన్యానికి చైనా కరోనా టీకా!

ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్‌కు డ్రాగన్ కంట్రీ చైనా సాయం చేసింది. పాక్ సైన్యానికి కరోనా టీకా అందజేసింది. పాకిస్తాన్ మిలటరీకి చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నుంచి ఈ వ్యాక్సిన్ అందింది. ఈ విసయాన్ని చైనీస్ రక్షణ శాఖ ఆదివారం వెల్లడించింది. ఎన్ని డోసుల వ్యాక్సిన్ అందజేసిందీ చైనా చెప్పలేదు. అయితే ఇలా వేరే దేశం నుంచి కరోనా వ్యాక్సిన్ పొందిన తొలి మిలటరీ పాక్‌దే. ఇంతకు ముందు కూడా చైనా.. తాను తయారుచేసిన సైనోఫార్మాకు చెందిన కరోనా వ్యాక్సిన్‌ను పాకిస్తాన్‌కు సరఫరా చేసింది. ఇవన్నీ చూస్తుంటే ఈ రెండు దేశాల మధ్య ఏవో లోపాయకారి ఒప్పందాలు ఉన్నట్లు కనబడుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2021-02-08T10:08:19+05:30 IST