బాలికలకు అశ్లీల చిత్రాలు పంపిన బీజేపీ నేత అరెస్టు
ABN , First Publish Date - 2021-07-13T13:38:38+05:30 IST
మైలాడుదురై సమీపంలో బాలికల సెల్‌ఫోన్‌కు అశ్లీల చిత్రాలు పంపిన బీజేపీ నేతను పిల్లల లైంగిక వేధింపుల నిరోధక చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. మైలాడుదురై జిల్లా కోళికుత్తి గ్రామా
పెరంబూర్(చెన్నై): మైలాడుదురై సమీపంలో బాలికల సెల్‌ఫోన్‌కు అశ్లీల చిత్రాలు పంపిన బీజేపీ నేతను పిల్లల లైంగిక వేధింపుల నిరోధక చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. మైలాడుదురై జిల్లా కోళికుత్తి గ్రామానికి చెందిన మహాలింగం(60) బీజేపీ యూనియన్ నిర్వాహకుడిగా వ్యవహరిస్తు న్నారు. అదే గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన 11, 7 ఏళ్ల బాలికలు సహా ఆరు మంది సెల్‌ఫోన్లకు అశ్లీల చిత్రాలు పంపడంతో పాటు తనతో అలా వ్యవహరించాలని బాలికలను వేధించాడు. ఈ విషయాన్ని ఓ బాలిక తల్లిదండ్రులు మైలాడుదురై మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విచారించిన పోలీసులు కేసు నమోదుచేసి మహాలింగంను అరెస్టు చేసి జైలుకు తరలించారు.