9 ప్రాంత్రాల్లో దుకాణాలు, హోటళ్ల ప్రారంభం

ABN , First Publish Date - 2021-08-10T12:57:53+05:30 IST

కరోనా వైరస్‌ మూడో దశ వ్యాప్తి ముందస్తు నిరోధక చర్యల్లో భాగంగా నగరంలో జనరద్దీతో కూడిన తొమ్మిది ప్రాంతాల్లో విధించిన నిషేధం సోమవారం ఉదయం నుంచి తొలగిస్తూ గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ అధికారులు ఉత్తర్వులు

9 ప్రాంత్రాల్లో దుకాణాలు, హోటళ్ల ప్రారంభం

చెన్నై: కరోనా వైరస్‌ మూడో దశ వ్యాప్తి ముందస్తు నిరోధక చర్యల్లో భాగంగా నగరంలో జనరద్దీతో కూడిన తొమ్మిది ప్రాంతాల్లో విధించిన నిషేధం సోమవారం ఉదయం నుంచి తొలగిస్తూ గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తొమ్మిది రోజుల క్రితం నగరంలో రోజూ నగరవాసులు అధికంగా గుమికూడే  తొమ్మిది ప్రాంతాల్లోని వీధులను మూసివేశారు. ఆ ప్రాంతాల్లోని వస్త్ర, నగల, కిరాణా దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, ప్లాట్‌ఫామ్‌ దుకాణాలన్నీ మూసివేశారు. ఆ ప్రాంతాల్లో జనసంచారం జరుగకుండా కార్పొరేషన్‌ అధికారులు, పోలీసులతో నిఘా వేశారు. టి.నగర్‌ రంగనాథన్‌ వీధి పరిసరాలు, పురషవాక్కం డౌటన్‌, ప్యారీస్‌కార్నర్‌ కొత్వాల్‌చావిడి, ట్రిప్లికేన్‌ జాంబజార్‌ ప్రాంతం, రాయపురం కల్‌మండపం ప్రాంతం, రెడ్‌హిల్స్‌లోని పలు వీధుల్లో జనసంచారంపై నిషేధం అమలు చేశారు. ఈ నేపథ్యంలో సడలింపుల లాక్‌డౌన్‌ సోమవారం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభం కావడంతో ఈ తొమ్మిది ప్రాంతాల్లోని వీధుల్లో జసంచారాన్ని కట్టడి చేస్తూ విధించిన నిషేధాన్ని గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ ఉన్నతాధికారులు తొలగించారు. దీంతో సోమవారం ఉదయం నుంచి ఈ ప్రాంతాల్లో దుకాణాలు తెరిచారు.  టి.నగర్‌ రంగనాథన్‌ వీథిలోని వస్త్ర, నగల దుకాణాలు ప్రారంభమయ్యాయి. ఇదే విధంగా ట్రిప్లికేన్‌, రాయపురం, అమింజికరై, పురషవాక్కం ప్రాంతాల్లోనూ దుకా ణాలు మళ్ళీ తెరి చారు. ఈ ప్రాంతాల్లో ఫ్లాట్‌ఫామ్‌ దుకాణాలను కూడా తెరుచుకున్నాయి.

Updated Date - 2021-08-10T12:57:53+05:30 IST