కుండపోతతో స్తంభించిన వేలూరు

ABN , First Publish Date - 2021-07-12T14:48:14+05:30 IST

జిల్లాలో కొద్దిరోజులుగా కురస్తున్న వర్షాలతో పలు మార్గాల్లో జనజీవనం స్తంభించింది. వరద ప్రవాహం కారణంగా అమిరిదీ, నాగనదిపై వంతెనలు కొట్టుకుపోవడంతో, జువ్వాది కొండ ప్రాంతంలోని

కుండపోతతో స్తంభించిన వేలూరు

చెన్నై/వేలూరు: జిల్లాలో కొద్దిరోజులుగా కురస్తున్న వర్షాలతో పలు మార్గాల్లో జనజీవనం స్తంభించింది. వరద ప్రవాహం కారణంగా అమిరిదీ, నాగనదిపై వంతెనలు కొట్టుకుపోవడంతో, జువ్వాది కొండ ప్రాంతంలోని 25 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. గుడియాత్తం ప్రభుత్వాస్పత్రిలోని కరోనా వార్డులో ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు వర్షపు నీరు ప్రవేశించడంతో, అక్కడ చికిత్సలు పొందుతున్న వారిని వేరే వార్డుకు తరలించారు. మున్సిపాలిటీ ఉద్యోగులు నీటిని తొలగించే పనులు చేపట్టారు. తిరుపత్తూర్‌ జిల్లాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా పాలారు, ఆంబూరు వైపుగా గుడియాత్తం పాలారు నదిలో వరద ఉధృతి చోటుచేసుకుంది. రాణిపేట జిల్లా అరక్కోణం సమీపం నెమిలి, పణపాక్కం, నాగవేడు, సేందమంగళం తదితర ప్రాంతాల్లో వీచిన ఈదురుగాలులతో కూడిన భారీవర్షానికి 100 చెట్లు నేలకూలగా, 100 ఎకరాల్లో పంట నీటమునిగింది. చెట్లు కూలడంతో పలు గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది.

Updated Date - 2021-07-12T14:48:14+05:30 IST