10 ఎకరాల వరి పంటను ధ్వంసం చేసిన ఏనుగు

ABN , First Publish Date - 2021-05-20T17:00:58+05:30 IST

వాణియంబాడి సమీపం కావలూరు అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఏనుగు పొలల్లో ప్రవేశించి పంటను ధ్వంసం చేస్తుండడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు...

10 ఎకరాల వరి పంటను ధ్వంసం చేసిన ఏనుగు

చెన్నై/వేలూరు: వాణియంబాడి సమీపం కావలూరు అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఏనుగు పొలల్లో ప్రవేశించి పంటను ధ్వంసం చేస్తుండడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాండురంగన్‌, దివాకరన్‌, జగదీశన్‌ అనే రైతులకు చెందిన 10 ఎకరాల వరి పంటను ఏనుగు ధ్వంసం చేసింది. గ్రామస్తులు బాణసంచా కాల్చి ఏనుగును తరమికొట్టగా, అది అక్కడి నుంచి కృష్ణాపురంలోకి వెళ్లి ఐదు గుడిసెలను ధ్వంసం చేసింది. ప్రాణనష్టం జరుగ కముంతే ఏనుగును అడవిలోని పంపేలా చర్యలు చేపట్టాలని, నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - 2021-05-20T17:00:58+05:30 IST