బాయిలర్‌ పేలి ఇద్దరు కార్మికుల దుర్మరణం

ABN , First Publish Date - 2021-07-12T17:27:52+05:30 IST

తిరువళ్లూర్‌ జిల్లా గుమ్మిడిపూండి సమీపంలోని సిప్కాట్‌లోని కర్మాగారంలో బాయిలర్‌ పేలిన ఘటనలో ఇద్దరు కార్మికులు మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి...

బాయిలర్‌ పేలి ఇద్దరు కార్మికుల దుర్మరణం

చెన్నై/పెరంబూర్: తిరువళ్లూర్‌ జిల్లా గుమ్మిడిపూండి సమీపంలోని సిప్కాట్‌లోని కర్మాగారంలో బాయిలర్‌ పేలిన ఘటనలో ఇద్దరు కార్మికులు మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. సిప్కాట్‌లోని టైర్ల తయారీ కర్మాగారంలో ఆదివారం మధ్యాహ్నం హఠాత్తుగా బాయిలర్‌ ట్యూబ్‌ పేలడంతో జితేంద్ర, కుందన్‌ అనే కార్మికులు తీవ్రగాయాలతో సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. ఈ ఘటనలో గాయపడిన మరో ముగ్గురిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు, ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-07-12T17:27:52+05:30 IST