ప్రయాణికులను కాపాడి ప్రాణాలొదిలిన డ్రైవర్‌

ABN , First Publish Date - 2021-07-12T17:15:05+05:30 IST

గోపిశెట్టిపాళయం సమీ పంలో ప్రభుత్వ బస్సు నడుపుతూ హఠాత్తుగా గుండెపోటుకు గురైన డ్రైవర్‌, బస్సును రోడ్డు పక్కన నిలిపి ప్రయాణికు ...

ప్రయాణికులను కాపాడి ప్రాణాలొదిలిన డ్రైవర్‌

చెన్నై/పెరంబూర్: గోపిశెట్టిపాళయం సమీ పంలో ప్రభుత్వ బస్సు నడుపుతూ హఠాత్తుగా గుండెపోటుకు గురైన డ్రైవర్‌, బస్సును రోడ్డు పక్కన నిలిపి ప్రయాణికు లను రక్షించి మృతిచెంది న ఘటన విషాదానికి దారితీసింది. ఈరోడ్‌ జిల్లా గవుందంపాడి సమీపం మనియన్‌కాట్టూర్‌ ప్రాంతా నికి చెందిన సెల్వరాజ్‌ (52) ప్రభుత్వ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం గవుందంపాడి నుంచి పెరుందురై వెళ్లే బస్సును సెల్వరాజ్‌ నడుపుతున్నాడు. వెల్లంకోయిల్‌ బస్టాండ్‌లో ప్రయాణికులు దిగిన తర్వాత మళ్లీ బస్సు నడుపుతున్న సెల్వరాజ్‌ హఠాత్తుగా గుండెపోటుకు గురై రోడ్డు పక్కనే బస్సు నిలిపి స్పృహతప్పి పడిపోయాడు. దీనిని గమనించిన కండక్టర్‌ కనకసభాపతి ప్రయాణికుల సాయంతో సెల్వరాజ్‌ను సిరువాలూర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, గుండెపోటు కారణంగా మార్గమధ్యంలోనే అతను మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు.

Updated Date - 2021-07-12T17:15:05+05:30 IST