కరోనా బాధిత గర్భిణులకు ప్రత్యేక వార్డు
ABN , First Publish Date - 2021-05-21T14:27:00+05:30 IST
తిరువళ్లూర్ జిల్లాలో కరోనా బాధిత గర్భిణులకు ప్రత్యేక వార్డు ఏర్పాటైంది. తిరువ ళ్లూర్ సమీపం కడంబత్తూర్ యూనియన్ పేరంబాక్కం పంచాయతీలోని

చెన్నై/పెరంబూర్: తిరువళ్లూర్ జిల్లాలో కరోనా బాధిత గర్భిణులకు ప్రత్యేక వార్డు ఏర్పాటైంది. తిరువ ళ్లూర్ సమీపం కడంబత్తూర్ యూనియన్ పేరంబాక్కం పంచాయతీలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో 30 పడకలున్నాయి. వీటిలో 10 పడకలను కరోనా బాధితుల కు కేటాయించగా, 4 ఆక్సిజన్ వసతితో ఉన్నాయి. ఈ విషయమై ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ జవహర్‌లాల్ మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలో తొలిసారిగా కరోనా బాధిత గర్భిణులకు పేరంబాక్కం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక వార్డు కేటాయించామన్నారు. వార్డులో వైద్యుల నిరంతర పర్యవేక్షణ తో పాటు మౌలిక వసతులు కల్పించినట్లు ఆయన తెలిపారు.