ఆనైమలై పులుల శరణాలయంలో..సీతాకోకచిలుకల సీజన్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2021-05-21T13:05:23+05:30 IST

ఆనైమలై పులుల శరణాలయంలో సీతాకోక చిలుకల సీజన్‌ ప్రారంభమైంది. పశ్చిమ కనుమల ప్రాంతంలో వన్యప్రాణుల రక్షణా కేంద్రాల్లో ఆనైమలై

ఆనైమలై పులుల శరణాలయంలో..సీతాకోకచిలుకల సీజన్‌ ప్రారంభం

చెన్నై/ పెరంబూర్: ఆనైమలై పులుల శరణాలయంలో సీతాకోక చిలుకల సీజన్‌ ప్రారంభమైంది. పశ్చిమ కనుమల ప్రాంతంలో వన్యప్రాణుల రక్షణా కేంద్రాల్లో ఆనైమలై పులుల శరణాలయం ఒకటి. ఈ శరణాలయంలో పొల్లాచ్చి అటవీ రేంజ్‌ పరిధిలో పొల్లాచ్చి, ఉలాంది, వాల్పారై, మానాంపల్లి తదితర బీట్‌ సెక్షన్లున్నాయి. అడవి ఏనుగులు, పులులు, చిరుతపులులు, జింకలు, అడవి దున్నలు, ఎలుగుబంట్లు సహా పలురకాల వన్యమృగాలు ఈ శరణాలయంలో ఉన్నాయి. ప్రతి ఏడాది మే నుంచి డిసెంబరు వరకు ఈ ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఈ కాలాన్ని సీతాకోకచిలుకల సీజన్‌గా పిలుస్తుంటారు. నది, జలపాతాలు, పొదలు, మొక్కల వద్ద గుంపులుగా, గుంపులుగా రకకాల సీతాకోకచిలుకలు తిరు గుతుంటాయి. కొద్దిరోజులుగా ఆలియూరు, వాల్పారై, సర్కార్‌పతి, నవమలై తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో, ఆ ప్రాంతాలు పచ్చదనంతో నిండడంతో ప్రస్తుతం సీతాకోకచిలుకల సందడి అధికమైంది. ఈ విషయమై అటవీశాఖ అధికారి మాట్లాడుతూ, కోయంబత్తూర్‌ జిల్లాలో మేట్టుపాళయం కల్లారు, సిరువాని, ఆళియారు, నవమలై, సర్కార్‌పటి ప్రాంతాల్లో 150 రకాల సీతాకోకచిలుకలు కనిపిస్తున్నాయ న్నారు. ఆళియారు అటవీ చెక్‌పోస్ట్‌ సమీపంలో సీతాకోకచిలుక పార్కు ఏర్పాటు చేశామన్నారు. అందులో ప్రత్యేక మొక్కలు కూడా పెంచుతు న్నామని, ప్రస్తుతం సీజన్‌ ప్రారంభం కావడంతో సీతాకోకచిలుకలు అధికంగా కనిపిస్తున్నాయని అధికారి తెలిపారు.

Updated Date - 2021-05-21T13:05:23+05:30 IST