సేలం, మైసూరు, గోవా విమానాల రద్దు
ABN , First Publish Date - 2021-05-20T15:06:27+05:30 IST
కరోనా రెండో దశ తీవ్రంగా ఉన్న కారణంగా ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో చిన్న నగరాల విమాన సేవలను తదుపరి ఉత్తర్వులు...

చెన్నై/పెరంబూర్: కరోనా రెండో దశ తీవ్రంగా ఉన్న కారణంగా ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో చిన్న నగరాల విమాన సేవలను తదుపరి ఉత్తర్వులు అందే వరకు పూర్తిగా రద్దుచేశారు. ఆ ప్రకారం చెన్నై నుంచి సేలం, మైసూరు, కడప, కన్నూర్, గోవా రాష్ట్రం పనాజీ, రాంచీ, శిలిగురి తదితర నగరాలకు వెళ్లే విమాన సేవలు రద్దు కాగా, ప్రధాన నగరాలైన బెంగుళూరు, ఢిల్లీ, ముంబై నగరాలకు తక్కువ సంఖ్యలో విమానాలు నడు పనున్నారు. చెన్నై నుంచి మంగళవారం పలు నగరాలు, నగరాల నుంచి చెన్నైకు 30 విమానాలు మాత్రమే నడిపినట్టు అధికారులు తెలిపారు.