మెట్రోలో ఉచిత వైద్య కూపన్ల పంపిణీ
ABN , First Publish Date - 2021-10-28T14:24:35+05:30 IST
చెన్నై మెట్రోరైల్వే సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య కూపన్ల పంపిణీ జరుగు తోంది. ఎంజీఆర్ సెంట్రల్, సీఎంబీటీ మెట్రో రైల్వే స్టేషన్లలో గురువారం, సెయింట్ థామస్ మౌంట్, పచ్చయప్పన్ కళాశాల స్టేషన్లలో శుక్రవారం ఉదయం 1
ఐసిఎఫ్(Chennai): చెన్నై మెట్రోరైల్వే సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య కూపన్ల పంపిణీ జరుగు తోంది. ఎంజీఆర్ సెంట్రల్, సీఎంబీటీ మెట్రో రైల్వే స్టేషన్లలో గురువారం, సెయింట్ థామస్ మౌంట్, పచ్చయప్పన్ కళాశాల స్టేషన్లలో శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటలు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు వైద్యశిబిరాలు జరుగనున్నాయి. వీటిలో గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, నరాలు, మెదడుకు సంబంధించిన వ్యాధులు, శస్త్రచికిత్సలకు సంబంధించిన సలహాలు పొందవచ్చు. ఈ శిబిరాలకు కూపన్లు తీసుకుని వచ్చి సంబంధిత వైద్యుల వద్ద ఉచిత వైద్యసలహాలు పొందవచ్చని నిర్వాహకులు తెలిపారు.