తాగేందుకు డబ్బులివ్వలేదని కుమారుడిని హత్య చేసిన తండ్రి

ABN , First Publish Date - 2021-07-12T17:23:08+05:30 IST

మదురై జిల్లా అయ్యన్‌గౌండన్‌పట్టిలో తన పెళ్ళి సందర్భంగా తాగేందుకు డబ్బులివ్వలేదని గొడవపడిన కుమా రుడిని దారుణంగా హత్య చేసిన తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. అయ్యన్‌గౌండన్‌పట్టిలో ఇలంగోవన్‌...

తాగేందుకు డబ్బులివ్వలేదని కుమారుడిని హత్య చేసిన తండ్రి

చెన్నై: మదురై జిల్లా అయ్యన్‌గౌండన్‌పట్టిలో తన పెళ్ళి సందర్భంగా తాగేందుకు డబ్బులివ్వలేదని గొడవపడిన కుమా రుడిని దారుణంగా హత్య చేసిన తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. అయ్యన్‌గౌండన్‌పట్టిలో ఇలంగోవన్‌ (45), రాణి (45) అనే భార్యభర్తలు నివసిస్తున్నారు. వీరికి సుభాష్‌, ప్రదీప్‌ (22) అనే ఇద్దరు కుమారు లు, ఓ కుమార్తె ఉన్నారు. వీరిలో ప్రదీప్‌ మేకలు మేపుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రదీప్‌కు ఆదివారం ఉదయం వివాహం జరగాల్సి వుంది. శనివారం సాయం త్రం ప్రదీప్‌ పీకలదాకా మద్యం తాగి ఇంటికి చేరుకున్నాడు. అది గమనించి ఇలంగోవన్‌ పెళ్ళి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో తాగి ఎందుకొచ్చా వంటూ మండిపడ్డాడు. ప్రదీప్‌ తండ్రి మాటలను ఖాతరు చేయకుండా పెళ్ళికి వచ్చిన తన స్నేహితులకు మందు పార్టీ ఏర్పాటు కోసం డబ్బులివ్వమని పట్టుబట్టాడు. ఇలంగోవన్‌ డబ్బులివ్వక ప్రదీప్‌తో గొడవకు దిగాడు. ఇద్దరూ చితకబాదుకున్నారు. దీనితో ఆగ్రహం చెందిన ప్రదీప్‌ వేటకొడవలితో ఇలంగోవన్‌పై దాడి జరిపేందుకు ప్రయత్నించాడు. వెంటనే ఇలంగోవన్‌ ఆ వేటకొడవలిని లాక్కుని దానితో ప్రదీప్‌పై దాడి జరిపాడు. ఈ సంఘటనలో ప్రదీప్‌  కుప్పకూలి మృతి చెందాడు. వాడిపట్టి పోలీసులు ప్రదీప్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రదీప్‌ తండ్రి ఇలంగోవన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Updated Date - 2021-07-12T17:23:08+05:30 IST