నగరంలో కరోనా కల్లోలం...

ABN , First Publish Date - 2021-05-05T13:05:19+05:30 IST

చెన్నై మహానగరంలో కరోనా వైరస్‌ కల్లోలం సృష్టి స్తోంది. ఒక్కసారిగా కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగిపోయాయి. దీంతో నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో కిటకిట

నగరంలో కరోనా కల్లోలం...

- భారీగా పాజిటివ్‌ కేసులు ఫ ఆస్పత్రులన్నీ కిటకిట

- ఇతర జిల్లాల్లో రెమ్‌డెసివిర్‌ కష్టాలు


అడయార్‌(చెన్నై): చెన్నై మహానగరంలో కరోనా వైరస్‌ కల్లోలం సృష్టిస్తోంది. ఒక్కసారిగా కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగిపోయాయి. దీంతో నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో కిటకిట లాడుతున్నాయి. ఆస్పత్రుల్లోని సాధారణ పడకలే కాకుండా, ఐసీయూ వార్డులు నిండిపోయాయి. అలాగే, ఆక్సిజన్‌ నిల్వలు కూడా నిండుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. కరోనా బారినపడి ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగులకు మాత్రమే ఆస్పత్రుల్లో అడ్మిషన్‌ ఇస్తున్నారు. ఇతర కరోనా లక్షణాలతో బాధపడే వారిని హోం ఐసోలేషన్‌లోనే చికిత్స అందించేలా వైద్యులు చర్యలు తీసు కుంటున్నారు. 


ఆస్పత్రులన్నీ ఫుల్‌ 

చెన్నై నగరంలోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ సౌకర్యంతో కూడిన పడకలు 1618 మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడో నిండిపోయాయి. ఇక్కడ మరో 500 పడకలను కొత్తగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రభుత్వ స్టాన్లీ ఆస్పత్రిలో 1200 పడకలు ఉంటే అవికూడా కరోనా బాధితులతో నిండిపోయాయి. ఇక్కడ అదనంగా మరో 1250 పడకలను సిద్ధం చేస్తున్నారు. వీటిలో 750 పడకలను ఆక్సిజన్‌ సౌకర్యంతో తయారుచేస్తున్నారు. ఒకవైపు నగరంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. మరోవైపు తీవ్ర శ్వాస సమస్యలతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య ఎక్కువైంది. దీంతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగుల ఆరోగ్యం స్వల్పంగా మెరుగుపడిన వెంటనే సాధారణ వార్డుకు మార్చడం లేదా డిశ్చార్జి చేయడం జరుగుతోంది. వీటితో పాటు స్థానిక గిండిలోని కింగ్స్‌ ఇనిస్టిట్యూట్‌, కీల్పాక్కం, ఓమందూరు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లోని పడకలు కూడా నిండుకున్నాయి. అదేవిధంగా నగరంలోని అనేక ప్రైవేటు ఆస్పత్రుల్లోని పడకలు కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా ఖాళీలేదు. అదేసమయంలో పలు ప్రాంతాలతో పాటు ఆస్పత్రుల్లో కూడా ఆక్సిజన్‌ నిల్వలు కూడా నిండుకున్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే, ప్రభుత్వ ఆస్పత్రి వర్గాలు మాత్రం ఆక్సిజన్‌ నిల్వలు పూర్తిగానే ఉన్నాయని చెబుతున్నారు. ఆక్సిజన్‌ సౌకర్యంతో చికిత్స చేయాల్సిన రోగులకు పడకలు ఖాళీగా లేకపోవడంతో వారికి ఆస్పత్రుల్లో పడకలు కేటాయించడం తలకు మించిన భారంగా మారింది. దీంతో అంబులెన్సుల్లో వచ్చే రోగులు కొన్ని గంటల పాటు ఆ వాహనాల్లోనే నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. 


జిల్లాలను తాకిన రెమ్‌డెసివిర్‌ కష్టాలు

కరోనా రోగులకు వేసే ఇంజెక్షన్లలో రెమ్‌డెసివిర్‌ ఒకటి. ఈ మందుకు నగరంలో తీవ్ర డిమాండ్‌ ఉంది. డిమాండ్‌ పెరిగిపోవడంతో పాటు సప్లయ్‌ తగ్గిపోయింది. ఈ కారణంగా ఈ మందు బ్లాక్‌ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయించారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్ళడంతో ప్రభుత్వమే రంగంలోకి దిగి స్థానిక కీల్పాక్కం ప్రభుత్వ వైద్య కాలేజీ ప్రాంగణంలో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసి రెమ్‌డెసివిర్‌ను విక్రయి స్తోంది. అయితే, ఈ మందు కష్టా లు ఇపుడు ఇతర జిల్లాలకు చేరాయి. పైగా ఈ మందుకు కోసం ఇతర జిల్లాల నుంచి కరోనా రోగులు బంధువులు వ్యయప్రయాసలకోర్చి చెన్నై వస్తున్నారు. దీంతో ప్రభుత్వం పలు జిల్లాల్లో ఈ మందును విక్రయించేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మదురై, తిరుచ్చి, తిరునల్వేలి, సేలం, విల్లుపురం, తంజా వూరు తదితర జిల్లా కేంద్రాల్లో రెమ్‌డెసివిర్‌ మందును విక్రయాలు చేపట్టనున్నారు. ఇందుకు సంబం ధించిన అధికారిక ప్రకటన నేడో రేపో వెల్లడయ్యే అవకాశం ఉంది. Updated Date - 2021-05-05T13:05:19+05:30 IST