హోం క్వారంటైన్‌ను ఉల్లంఘిస్తే రూ.2వేలు జరిమానా
ABN , First Publish Date - 2021-05-19T14:41:12+05:30 IST
కరోనా రోగులు హోం క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించి బయటకు వస్తే, అలాంటి వారికి రూ.2వేలు జరిమానా విధించాలని...
చెన్నై (తమిళనాడు): కరోనా రోగులు హోం క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించి బయటకు వస్తే, అలాంటి వారికి రూ.2వేలు జరిమానా విధించాలని గ్రేటర్ చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. హోం క్వారంటైన్ లో ఉండాల్సిన కరోనా రోగులు నిబంధనలు ఉల్లంఘించి బయట తిరిగితే వారికి రూ.2వేలు జరిమానా విధిస్తామని, ఇలా తరచూ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిని కొవిడ్ కేర్ కేంద్రానికి తరలిస్తామని చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెప్పారు. మంగళవారం ఒక్కరోజే తమిళనాడులో 33,059 కరోనా కేసులు నమోదైనాయి. 21,262 మంది కరోనా నుంచి కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
గత 24 గంటల్లో 364 మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,31,596కి పెరిగింది. కరోనా కట్టడికి చర్యలు ముమ్మరం చేసిన సీఎం స్టాలిన్ కొవిడ్ కమాండ్ సెంటరును ఆకస్మిక తనిఖీ చేశారు. కరోనాతో మరణించిన ఫ్రంట్ లైన్ కార్మికులు, వైద్యులకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని సీఎం ప్రకటించారు. ఫ్రంట్ లైన్ కార్మికులకు ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ప్రత్యేక ఇన్ సెంటివ్ ఇవ్వాలని సీఎం నిర్ణయించారు.