Chennai: నగరంలో గ్రీన్‌ట్రెండ్స్‌ అకాడమీ

ABN , First Publish Date - 2021-10-31T16:13:43+05:30 IST

కెవిన్‌కేర్‌ సంస్థ నగరంలో తొలిసారిగా ‘గ్రీన్‌ట్రెండ్స్‌ అకాడమీ’ని ఏర్పాటు చేసింది. స్థానిక టి.నగర్‌, సౌత్‌ ఉస్మాన్‌రోడ్డులో ఏర్పాటైన ఈ అకాడమీ ద్వారా అందం, వస్త్రధారణ పరిశ్రమలో పెరుగుతున్న డిమాండ్‌కు తగినట్టుగా ప్రతిభ

Chennai: నగరంలో గ్రీన్‌ట్రెండ్స్‌ అకాడమీ

              - అకాడమీ ప్రారంభోత్సవంలో ప్రముఖులు


చెన్నై: కెవిన్‌కేర్‌ సంస్థ నగరంలో తొలిసారిగా ‘గ్రీన్‌ట్రెండ్స్‌ అకాడమీ’ని ఏర్పాటు చేసింది. స్థానిక టి.నగర్‌, సౌత్‌ ఉస్మాన్‌రోడ్డులో ఏర్పాటైన ఈ అకాడమీ ద్వారా అందం, వస్త్రధారణ పరిశ్రమలో పెరుగుతున్న డిమాండ్‌కు తగినట్టుగా ప్రతిభను తీర్చిదిద్దేందుకు కోర్సులను ప్రవేశపెట్టింది. శనివారం ఈ అకాడమీని కేంద్ర ఆదాయపు పన్నుశాఖ అదనపు కమిషనర్‌ నందకుమార్‌ దీనిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కెవిన్‌కేర్‌ ట్రెండ్స్‌ విభాగం బిజినెస్‌ హెడ్‌ ఆర్‌.గోపాలకృష్ణన్‌ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా వున్న నిపుణులతో ఇక్కడ శిక్షణ ఇస్తామని, ప్రపంచవ్యాప్తంగా వున్న ప్రముఖ కార్యక్రమాలతో, తమ అకాడమీ విద్యార్థులు పరిశ్రమలో తమకంటూ సముచితస్థానాన్ని సాధిస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్‌ట్రెండ్స్‌ అకాడమీ హెడ్‌ నబిన్‌ బానిక్‌ తదితరులు కూడా పాల్గొన్నారు.

Updated Date - 2021-10-31T16:13:43+05:30 IST