రాష్ట్రంలో 70 శాతం హోటళ్ల మూత..రూ.500 కోట్ల నష్టం
ABN , First Publish Date - 2021-05-24T17:23:53+05:30 IST
లాక్‌డౌన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 70 శాతం హోటల్స్ మూతపడ్డాయి. ఈ కార ణంగా రూ.500 కోట్ల మేరకు ఆదాయం నష్టపోయినట్టు హోటల్

చెన్నై/అడయార్: లాక్‌డౌన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 70 శాతం హోటల్స్ మూతపడ్డాయి. ఈ కార ణంగా రూ.500 కోట్ల మేరకు ఆదాయం నష్టపోయినట్టు హోటల్ యజమానులు వాపోతున్నారు. రాష్ట్రంలో దాదాపు 50 వేలకు పైగా చిన్నా, పెద్దా హటల్స్ ఉన్నాయి. వీటిలో 20లక్షల మంది వరకు కార్మికులు పనిచేస్తున్నారు. అయితే, లాక్‌డౌన్ కారణంగా హోటల్స్ మూతపడటంతో అనేక మంది హోటల్ యజమానులతో పాటు కార్మికులు కూడా ఉపాధిని కోల్పోయారు. అందువల్ల హోటల్స్‌లో పనిచేసే కార్మికులకు ఆర్థిక సాయంతో పాటు.. హోటల్ పరిశ్రమకు రాయితీలివ్వాలని ఆవర్గాలు కోరుతున్నాయి.