టీకా వేసుకున్న గర్భిణి.. కడుపులోని శిశువు మృతి

ABN , First Publish Date - 2021-07-12T17:24:17+05:30 IST

తేని ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా నిరోధక టీకా వేసుకున్న ఆరునెలల గర్భిణీ కడుపులోని శిశువు మృతి చెందింది. బోడినాయకనూర్‌ సమీపం భద్రకాళిపురంలో...

టీకా వేసుకున్న గర్భిణి.. కడుపులోని శిశువు మృతి

చెన్నై: తేని ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా నిరోధక టీకా వేసుకున్న ఆరునెలల గర్భిణీ కడుపులోని శిశువు మృతి చెందింది. బోడినాయకనూర్‌ సమీపం భద్రకాళిపురంలో జగన్‌రాజ్‌, ఇరుదయరోసీ సిల్వియా (23) అనే భార్యాభర్తలు నివసిస్తున్నారు. ఇటీవల సిల్వియా గర్భందాల్చటంతో డెంపుచేరి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యపరీక్షలు జరుపుకుని తగు చికిత్సలందుకుంటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గర్భిణులకు టీకాలు వేసే కార్యక్రమం ప్రారంభమైంది. దీనితో సిల్వియాను ఆమె భర్త తేని ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రి వద్దకు తీసుకెళ్ళి కరోనా నిరోధక టీకా వేయించారు. ఆ తర్వాత జగన్‌రాజ్‌ భార్యను ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్ళి ఆమె కడుపులోని శిశువు ఏవిధంగా తెలుసుకోవడానికి వైద్యపరీక్షలు చేయించాడు. ఆ పరీక్షలలో సిల్వియా కడుపులోని శిశువు అచేతనంగా వున్నట్టు కనుగొన్నారు. తేని ఆస్పత్రిలో ఆమెకు పరీక్షలు జరిపిన వైద్యులు కడుపులోని శిశువు కొద్ది రోజులకే ముందే మృతి చెందినట్టు నిర్ధారించారు. 

Updated Date - 2021-07-12T17:24:17+05:30 IST