chamundi కొండకు పెరిగిన భక్తులు
ABN , First Publish Date - 2021-10-20T17:52:28+05:30 IST
శరన్నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో నాడదేవత చాముండిదేవిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తడంతో హుండీ ఆదా యం కూడా పెరిగింది. ఈ నెల 7 నుంచి 15 వరకు 74,480 మంది దర్శించుకోగా

- దసరా పదిరోజుల్లో రూ. 40 లక్షల ఆదాయం
బెంగళూరు(karnataka): శరన్నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో నాడదేవత చాముండిదేవిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తడంతో హుండీ ఆదాయం కూడా పెరిగింది. ఈనెల 7 నుంచి 15 వరకు 74,480 మంది దర్శించుకోగా రూ. 40.11 లక్షల ఆదాయం గడించినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి యతిరాజ్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఏడాదితో పోలిస్తే మూడురెట్లు ఆదాయం అధికమన్నారు. గత ఏడాది అక్టోబరు 7 నుంచి 15 మధ్య 9,825 మంది దర్శించుకోగా రూ.6.6 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. కొవిడ్ నిబంధనల మేరకు భక్తులను అనుమతించామన్నారు. విజయదశమి ముగిసినా కూడా భక్తుల సంఖ్య తగ్గడం లేదన్నారు. మరో నాలుగైదురోజులు కొండపై రద్దీ ఉంటుందని భావిస్తున్నట్టు తెలిపారు. లాక్‌డౌన్ అనంతరం మూడు నెలల తర్వాత మైసూరుకు పర్యాటకులు విచ్చేయడం ప్రారంభించారు. దసరా నేపథ్యంలో పర్యాటకుల సంఖ్య పెరిగింది.