నిరాడంబరంగా చాముండేశ్వరి రథోత్సవం
ABN , First Publish Date - 2021-10-20T17:27:40+05:30 IST
నాడదేవత చాముండేశ్వరిదేవి రథోత్సవం మంగళవారం నిరాడంబరంగా జరిగింది. మైసూరు యువరాజు యదువీర కృష్ణదత్త చామరాజ ఒడయార్ లాంఛనంగా ప్రారంభించారు. వేకువ జామున ఆలయంలో విశేషపూజలు, రుద్రాభి

బెంగళూరు(karnataka): నాడదేవత చాముండేశ్వరిదేవి రథోత్సవం మంగళవారం నిరాడంబరంగా జరిగింది. మైసూరు యువరాజు యదువీర కృష్ణదత్త చామరాజ ఒడయార్ లాంఛనంగా ప్రారంభించారు. వేకువ జామున ఆలయంలో విశేషపూజలు, రుద్రాభిషేకం, మహామంగళ హారతి నిర్వహించారు. అనంతరం అలంకరించిన అమ్మవారి ఉత్సవమూర్తిని చిన్న రథంపై ఊరేగించారు. రథోత్సవంలో రాజమాత ప్రమోదాదేవి ఒడయార్, యువరాణి త్రిషికాకుమారి సింగ్ పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు శశిశేఖర్ దీక్షిత్ నేతృత్వంలో ధార్మిక కార్యక్రమాలు సాగాయి. రాత్రి మండపోత్సవం జరిగింది. ఈనెల 21న తెప్పోత్సవం లేని కారణంగా తీర్థస్నానం ఆచరించడం ద్వారా శరన్నవరాత్రి పూజా కార్యక్రమాలు ముగియనున్నాయి.