బ్లేడ్‌తో సిజేరియన్‌!

ABN , First Publish Date - 2021-03-21T07:03:33+05:30 IST

నకిలీ డాక్టర్‌ సిజేరియన్‌ కారణంగా ఓ గర్భిణి కాన్పులో బిడ్డతో సహా మృతి చెందిన ఘటన ఇది. యూపీలోని సుల్తాన్‌ పూర్‌కు దగ్గర్లోని మా శారద ఆస్పత్రిలో రాజేంద్ర శుక్లా(30) అనే వ్యక్తి వైద్యుడిగా చేస్తున్నాడు

బ్లేడ్‌తో సిజేరియన్‌!

లఖ్‌నవూ, మార్చి 20: నకిలీ డాక్టర్‌ సిజేరియన్‌ కారణంగా ఓ గర్భిణి కాన్పులో బిడ్డతో సహా మృతి చెందిన ఘటన ఇది. యూపీలోని సుల్తాన్‌ పూర్‌కు దగ్గర్లోని మా శారద ఆస్పత్రిలో రాజేంద్ర శుక్లా(30) అనే వ్యక్తి వైద్యుడిగా చేస్తున్నాడు. కానీ అతడు చదివింది 8వ తరగతి వరకే. పురిటి నొప్పులతో బాధపడుతున్న పూనమ్‌(33) అనే మహిళను ఆమె కుటుంబీకులు ఆ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఓ మంత్రసాని సాయంతో రాజేంద్ర బ్లేడ్‌తో సిజేరియన్‌ చేశాడు. ఈక్రమంలో తీవ్ర రక్తస్రావమైన పూనమ్‌, ఆమెకు పుట్టిన పసికందు కన్నుమూశారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపడంతో నిందితుడిని  పోలీసులు అరెస్టు చేశారు.

Updated Date - 2021-03-21T07:03:33+05:30 IST