బెదిరించి డబ్బు వసూలు చేస్తున్న ముగ్గురి అరెస్టు

ABN , First Publish Date - 2021-08-27T17:07:21+05:30 IST

క్రిష్ణగిరి జిల్లా కెలమంగళం ప్రాంతంలో ఉద్యోగాలకు వెళ్లి వచ్చే వారిని బెదిరించి డబ్బు వసూలు చేస్తున్న ముగ్గురు నిందితులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. కెల

బెదిరించి డబ్బు వసూలు చేస్తున్న ముగ్గురి అరెస్టు

డెంకణీకోట(బెంగళూరు): క్రిష్ణగిరి జిల్లా కెలమంగళం ప్రాంతంలో ఉద్యోగాలకు వెళ్లి వచ్చే వారిని బెదిరించి డబ్బు వసూలు చేస్తున్న ముగ్గురు నిందితులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. కెలమంగళంకు చెందిన సురే్‌షబాబు, ఇరుదాళం గ్రామానికి చెందిన భాస్కర్‌, ప్రభాకర్‌లను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. కెలమంగళం సమీపంలోని అగ్గొండపల్లి ప్రాంతంలో ఉద్యోగాలకు వెళ్లి వచ్చేవారిని అడ్డగించి కత్తులతో బెదిరించి నగదును వసూలు చేస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయన్నారు. ఈ నేపథ్యంలో వారిని అరెస్టు చేయడం జరిగిందన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-08-27T17:07:21+05:30 IST