భారత దేశంలో కొత్తగా 12,689 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-01-27T16:27:31+05:30 IST

భారత దేశ వ్యాప్తంగా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖంపట్టింది.

భారత దేశంలో కొత్తగా 12,689 కరోనా కేసులు

న్యూఢిల్లీ: భారత దేశ వ్యాప్తంగా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖంపట్టింది. అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 12,689 మందికి కోరోనా నిర్ధారణ కాగా.. 137 మంది మరణించారు. దీంతో భారత్‌లో ఇప్పటి వరకు 1,06,89,527 పాజిటీవ్ కేసులు నమోదుకాగా.. 1,53,724 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 1,76,498 యాక్టివ్ కేసులు ఉన్నాయని, చికిత్స నుంచి కోలుకుని 1,03,59,305 మంది బాధితులు డిశ్చార్జ్ అయినట్లు బుధవారం ఉదయం కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. కాగా నిన్న ఒక్కరోజే 13,320 మంది  కోలుకున్నారని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 96.91 శాతం కాగా, మరణాల రేటు 1.44 శాతంగా ఉంది.

Updated Date - 2021-01-27T16:27:31+05:30 IST