వాతావరణ మార్పుతో అనారోగ్యానికి గురైనట్టు తొలికేసు నమోదు

ABN , First Publish Date - 2021-11-10T02:11:17+05:30 IST

వాతావరణ మార్పుతో అనారోగ్యానికి గురైనట్టు తొలికేసు నమోదు

వాతావరణ మార్పుతో అనారోగ్యానికి గురైనట్టు తొలికేసు నమోదు

టొరంటో: వాతావరణ మార్పులు చాలా ప్రమాదకరమని కొంత కాలంగా పర్యావరణ వేత్తలు తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు. అనేక దేశాలు కూడా ఈ విషయమై చర్చలు చేశాయి కానీ, తీసుకోవాల్సిన చర్యలు ఆశించిన స్థాయిలో లేవనే విమర్శ బలంగా ఉంది. కాగా, వాతావరణ మార్పుల కారణంగా అనారోగ్యానికి గురైనట్టు మొట్టమొదటి కేసు కెనడాలో నమోదైంది. డాక్టర్ కైలీ మెర్రిట్ (70) అనే మహిళ వాతావరణ మార్పు కారణంగా అనారోగ్యం పాలై కూటెనే లేక్ అనే ఆసుపత్రిలో చేరినట్లు కెనడా మీడియా పేర్కొంది.


అనారోగ్యానికి గురైన మెర్రిట్ గురించి ఆసుపత్రిలోని అత్యవరసర విభాగం అధిపతి మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉంది. శరీరంలో తేమ కోసం ఆమె చాలా పోరాడాల్సి వస్తోంది. ఎమర్జెన్సీ విభాగంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వేడి గాలులు తీవ్రంగా ఉన్న కారణంగా ప్రస్తుతం ఇక్కడి ప్రజలు స్ప్రే బటిల్స్ కొనడానికి డాలర్ స్టోర్లకు పరుగులు తీస్తున్నారు’’ అని అన్నారు. అమెరికా, కెనడా దేశాల్లో ఈ మధ్య వేడి గాలుల ప్రభావం తీవ్రంగా పెరిగిందట. ఈ గాలుల కారణంగా ఒక్క బ్రిటిష్ కొలంబియాలోనే 233 మంది చనిపోయినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

Updated Date - 2021-11-10T02:11:17+05:30 IST