ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తీసుకున్న కెనడా వాసి మృతి!

ABN , First Publish Date - 2021-05-05T18:26:36+05:30 IST

యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనికా సంయుక్తంగా ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్ తీసుకున్న ఓ కెనడా వ్యక్తి మరణించాడు.

ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తీసుకున్న కెనడా వాసి మృతి!

యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనికా సంయుక్తంగా ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్ తీసుకున్న ఓ కెనడా వ్యక్తి మరణించాడు. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌కు సంబంధించినంత వరకు కెనడాలో ఇదే తొలి మరణం. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రక్తం గడ్డకట్టడంతో కెనడాలోని అల్బెర్టాకు చెందిన వ్యక్తి మృతి చెందాడు. 


ఈ విషయాన్ని కెనడా చీఫ్ మెడికల్ ఆఫీసర్ వెల్లడించారు. కెనడాలో ఇప్పటివరకు 2.5 లక్షల ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ డోస్‌లను ఉపయోగించగా, ఇదే తొలి మరణమని ఆయన వ్యాఖ్యానించారు. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ను భారత్‌లో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ `కోవిషీల్డ్` పేరుతో ఉత్పత్తి చేస్తోంది. 


Updated Date - 2021-05-05T18:26:36+05:30 IST