కొబ్బరి కురిడీకి కనీస మద్దతు ధర ప్రకటించిన కేంద్రం

ABN , First Publish Date - 2021-12-23T02:53:23+05:30 IST

న్యూఢిల్లీ: కొబ్బరి కురిడీకి, నాణ్యత గల కొబ్బరి చిప్పలకు కేంద్రం కనీస మద్దతు ధరలు ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో మద్దతు ధరలపై నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు

కొబ్బరి కురిడీకి కనీస మద్దతు ధర ప్రకటించిన కేంద్రం

న్యూఢిల్లీ: కొబ్బరి కురిడీకి, నాణ్యత గల కొబ్బరి చిప్పలకు కేంద్రం కనీస మద్దతు ధరలు ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో మద్దతు ధరలపై నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. కొబ్బరి కురిడీకి క్వింటాల్‌కు 10, 590 రూపాయలుగా, నాణ్యత గల కొబ్బరి చిప్పలకు క్వింటాల్‌కు 11 వేల రూపాయల చొప్పున మద్దతు ధరలు ప్రకటించారు. 2022 సంవత్సరానికి ఈ కనీస మద్దతు ధరలు వర్తిస్తాయని ఆయన చెప్పారు. కొబ్బరి కురిడీ కనీస మద్దతు ధరలకన్నా 58 శాతం, కొబ్బరి చిప్పల కనీస మద్దతు ధరలకన్నా 52 శాతం అధికంగా పెంచినట్లు ఠాగూర్ తెలిపారు. 

Updated Date - 2021-12-23T02:53:23+05:30 IST