డిసెంబర్ నాటికి పెద్దలందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తాం : హర్షవర్ధన్

ABN , First Publish Date - 2021-05-22T03:32:30+05:30 IST

ఈ సంవత్సరం చివరికి దేశంలోని పెద్దలందరికీ వ్యాక్సినేషన్ పూర్తయ్యే విధంగా ముందుకు సాగుతామని

డిసెంబర్ నాటికి పెద్దలందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తాం : హర్షవర్ధన్

న్యూఢిల్లీ : ఈ సంవత్సరం చివరికి దేశంలోని పెద్దలందరికీ వ్యాక్సినేషన్ పూర్తయ్యే విధంగా ముందుకు సాగుతామని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రకటించారు. జనాభాకు అనుగుణంగా కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి కావడానికి వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సంస్థలకు శతధా సహకరిస్తామని ప్రకటించారు. దేశంలోని 9 రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై హర్షవర్ధన్ శుక్రవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆగస్టు, డిసెంబర్ మాసాల మధ్య 216 కోట్ల వ్యా్క్సిన్ డోసులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, జూలై నాటికి 51 కోట్ల డోసులను ఉత్పత్తి చేస్తామని తెలిపారు. 

Updated Date - 2021-05-22T03:32:30+05:30 IST