బ్యూటీపార్లర్‌ యజమాని ఇంట్లో చోరీ

ABN , First Publish Date - 2021-09-02T14:50:58+05:30 IST

స్థానిక పుళల్‌ సమీపంలో బ్యూటీపార్లర్‌ యజమాని ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి 70 సవర్ల నగలు, రూ.2 లక్షల నగదు దోచుకెళ్లారు. పుళల్‌ టీచర్స్‌ కాలనీ 6వ వీధికి చెందిన

బ్యూటీపార్లర్‌ యజమాని ఇంట్లో చోరీ

పెరంబూర్‌(చెన్నై): స్థానిక పుళల్‌ సమీపంలో బ్యూటీపార్లర్‌ యజమాని ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి 70 సవర్ల నగలు, రూ.2 లక్షల నగదు దోచుకెళ్లారు. పుళల్‌ టీచర్స్‌ కాలనీ 6వ వీధికి చెందిన కవిత (27) పోరూర్‌లో బ్యూటీపార్లర్‌ నిర్వహిస్తోంది. ఆమె సినీతారలకు కూడా మేకప్‌ చేస్తుంది. తన భర్త వేలాయుధంతో కలపి గత నెల 30వ తేది తిరువణ్ణామలై ఆలయానికి వెళ్లింది. బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఇంటికి రాగా, తలుపులు బద్దలుకొట్టి ఉండడం, ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండడం చూసి దిగ్ర్భాంతి చెంది గదిలోకి వెళ్లి చూడగా, బీరువాలోని 70 సవర్ల నగలు, రూ.2 లక్షల నగదు చోరీకి గురికావడం గుర్తించారు. ఈ విషయమై బాధితులు పుళల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీ చేసిన పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా, కొద్దిరోజులుగా పుళల్‌ పరిసర ప్రాంతాల్లో దోపిడీలు అధికమవడంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు.


Updated Date - 2021-09-02T14:50:58+05:30 IST