ఈసారి బడ్జెట్‌ పేపర్‌రహితం!

ABN , First Publish Date - 2021-01-12T09:04:49+05:30 IST

కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ పత్రాలను ముద్రించవద్దని కేంద్ర

ఈసారి బడ్జెట్‌ పేపర్‌రహితం!

కొవిడ్‌ నేపథ్యంలో ఆర్థిక శాఖ నిర్ణయం


న్యూఢిల్లీ, జనవరి 11: కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ పత్రాలను ముద్రించవద్దని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దీంతో ఈసారి బడ్జెట్‌ పేపర్‌రహితంగా ఉండనుంది. ఎలక్ర్టానిక్‌ రూపంలోనే బడ్జెట్‌కు సంబంధించిన వివరాలను మొత్తం పార్లమెంట్‌ సభ్యుల(ఎంపీలు)కు అందించనున్నారు. స్వతంత్ర భారత చరిత్రలో బడ్జెట్‌ పత్రాలను ముద్రించకపోవడం ఇదే మొదటిసారికానుంది.  

Updated Date - 2021-01-12T09:04:49+05:30 IST