బడ్జెట్‌లో అసలు వాస్తవం మరుగుపరిచారు: మనీష్ తివారీ
ABN , First Publish Date - 2021-02-02T01:42:52+05:30 IST
స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) 37 నెలలుగా తగ్గుతూ వస్తోందని, ఆ వాస్తవాన్ని బడ్జెట్‌లో

న్యూఢిల్లీ: స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) 37 నెలలుగా తగ్గుతూ వస్తోందని, ఆ వాస్తవాన్ని బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎందుకు మరుగుపరచారని, ఎందుకు ప్రస్తావించ లేదని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. 1991 నుంచి చూస్తే దేశం ఎన్నడూ లేనంత సంక్షోభ పరిస్థితిని ఇప్పుడు ఎదుర్కొంటోందని పేర్కొంది. 2021-2022 బడ్జెట్‌పై కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ తివారీ మీడియాతో మాట్లాడుతూ, బడ్జెట్‌కు ప్రధాన లక్ష్యం, దిశానిర్దేశం లేదన్నారు. బడ్జెట్‌లో ఒక్క మానిటైజేషన్ ప్లాన్ మాత్రమే కనిపిస్తోందని, అదికూడా 'దేశాన్ని అమ్మకానికి పెట్టడం' (నేషనల్ సెల్ అవుట్)కిందకే వర్తిస్తుందని అన్నారు. కుటుంబ సంపద అమ్ముకుంటే కానీ ఆర్థికంగా నిలదొక్కుకోలేమనే విషయం కుండబద్ధలు కొట్టినట్టు బడ్జెట్‌లో చెప్పినట్టయిందని తివారీ విశ్లేషించారు.