పాక్ సరిహద్దుల్లో డ్రోన్ సంచారం...కాల్పులు జరిపిన BSF జవాన్లు

ABN , First Publish Date - 2021-10-28T17:14:58+05:30 IST

భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో అర్దరాత్రి ఓ డ్రోన్ కనిపించింది...

పాక్ సరిహద్దుల్లో డ్రోన్ సంచారం...కాల్పులు జరిపిన BSF జవాన్లు

అమృత్‌సర్‌(పంజాబ్):భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో అర్దరాత్రి ఓ డ్రోన్ కనిపించింది. పంజాబ్ రాష్ట్రంలోని మృత్‌సర్‌ అజ్నాలా పోలీసుస్టేషను పరిధిలోని  షాపూర్ సరిహద్దు అవుట్ పోస్టు వద్ద డ్రోన్ ప్రత్యక్షమైంది.దీంతో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లోని 73వ బెటాలియన్ జవాన్లు డ్రోన్‌పై కాల్పులు జరిపారు. దీంతో డ్రోన్ సరిహద్దులోని పాకిస్థాన్ వైపు తిరిగి వెళ్లింది.పాకిస్థాన్ నుంచి భారత్ వైపు భూభాగంలో ఆయుధాలు, డ్రగ్స్ ను వదిలేందుకు పాకిస్థాన్ డ్రోన్లను అర్దరాత్రి పంపించిందని బీఎస్ఎఫ్ జవాన్లు అనుమానం వ్యక్తం చేశారు.అక్టోబరు 19, 20వతేదీ మధ్య రాత్రి అమృత్‌సర్ సెక్టార్‌లోని ఇండో-పాక్ సరిహద్దుల్లోనూ ఇలాంటి డ్రోన్ కనిపించింది. 


ఆ డ్రోన్ ను బీఎస్ఎఫ్ జవాన్లు కూల్చివేయగా, దాంతో పాటు కిలో హెరాయిన్ తోపాటు ఇనుప ఉంగరం లభించింది.ఈ ఏడాది జూన్ 27వతేదీన జమ్మూలోని ఇండియన్ ఎయిర్ ఫోర్సు స్టేషనుపై తొలి సారి డ్రోన్ దాడి జరిగింది. సరిహద్దు దాటి వచ్చిన రెండు డ్రోన్‌లు బాంబులను పడవేయడంతో ఇద్దరు ఎయిర్‌మెన్‌లు గాయపడ్డారు. సరిహద్దుల్లో డ్రోన్ల సంచారం పెరగడంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లలో నేషనల్ సెక్యూరిటీ గార్డులను మోహరించారు. దీంతోపాటు సరిహద్దుల్లో కీలకప్రాంతాల్లో యాంటీ డ్రోన్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.

Updated Date - 2021-10-28T17:14:58+05:30 IST