డబ్బు కోసం చెల్లిని పెళ్లి చేసుకున్న అన్న

ABN , First Publish Date - 2021-12-15T23:19:28+05:30 IST

ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బు, ఇతర సౌకర్యాల నిమిత్తం ఓ వ్యక్తిని తన చెల్లిని పెళ్లి చేసుకున్నాడు. ముఖ్యమంత్రి పథకంలో భాగంగా డిసెంబర్ 11న నిర్వహించిన సామూహిక వివాహంలో ఈ చర్యకు పాల్పడ్డాడు. అయితే గ్రామస్థుల సహకారంతో పెళ్లి చేసుకున్న జంటను..

డబ్బు కోసం చెల్లిని పెళ్లి చేసుకున్న అన్న

లఖ్‌నవూ: ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బు, ఇతర సౌకర్యాల నిమిత్తం ఓ వ్యక్తిని తన చెల్లిని పెళ్లి చేసుకున్నాడు. ముఖ్యమంత్రి పథకంలో భాగంగా డిసెంబర్ 11న నిర్వహించిన సామూహిక వివాహంలో ఈ చర్యకు పాల్పడ్డాడు. అయితే గ్రామస్థుల సహకారంతో పెళ్లి చేసుకున్న జంటను గుర్తించి వీరు అన్నాచెల్లెలు అని పేర్కొన్నారు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ డెవలప్‌మెంట్ అధికారి చంద్రభాన్ సింగ్ ఈ విషయం తెలుసుకుని వారిపై కేసు నమోదు చేసి విచారణకు ఆదేశంచారు. పెళ్లి చేసుకున్న జంటకు ప్రభుత్వ పథకం కింద గృహోపకరణాలు అందించామని, వాటిని వెనక్కి తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు.


డసెంబర్ 11న తుండ్లా బ్లాక్‌లో జరిగిన సామూహిక వివాహంలో ఈ జంటతో పాటు మరో 51 జంటలు పెళ్లిల్లు చేసుకున్నాయి. ఈ కార్యక్రమాన్ని తుండ్లా బ్లాక్ అభివృద్ధి అధికారి కుమార్ నిర్వహించారు. ఇద్దరి ఆధార్ కార్డ్ వివరాల ఆధారంగా వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని కుమార్ పేర్కొన్నారు. అయితే ఇలాంటి ఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. 2018 నవంబర్‌లో ఉన్నావ్‌లో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ఇక అప్పటికే పెళ్లైన జంటలు ప్రభుత్వ పథకాల కోసం ప్రభుత్వాలు నిర్వహించే సామూహిక పెళ్లి కార్యక్రమంలో పెళ్లిల్లు చేసుకునే ఘటనలు కూడా అనేకం జరుగుతుంటాయి.

Updated Date - 2021-12-15T23:19:28+05:30 IST