బ్రిటన్‌ను వదలని కొవిడ్.. ఆంక్షలు ఎత్తాక మారు పంజా

ABN , First Publish Date - 2021-10-20T00:58:37+05:30 IST

సోమవారం బ్రిటన్‌లో ఏకంగా 50 వేల కేసులకు చేరువయ్యాయి. మార్చి ముగింపు నుంచి రోజులకు 100 మంది చొప్పున బ్రిటనర్లు కొవిడ్ కారణంగా చనిపోతున్నారు. మొత్తం మరణాల సంఖ్యలో యూరప్‌లో రష్యా తర్వాత బ్రిటన్ రెండో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు బ్రిటన్‌లో 1.38 లక్షల మంది కొవిడ్ కారణంగా చనిపోయారు

బ్రిటన్‌ను వదలని కొవిడ్.. ఆంక్షలు ఎత్తాక మారు పంజా

లండన్: మెజారిటీ ప్రజలకు వ్యాక్సినేషన్ పూర్తైంది. కేసులు భారీ సంఖ్యలో తగ్గాయి. దీంతో ఇక ఆంక్షలు అవసరం లేదని, కోవిడ్ నిబంధనలను ఎత్తివేసింది బ్రిటన్ ప్రభుత్వం. అంతే నిశ్శబ్దం అనంతరం ముంచుకొచ్చిన పెను తుఫానుగా కొవిడ్ మహమ్మారి బ్రిటన్‌ను మరోసారి కుదిపి వేస్తోంది. ఎంతలా అంటే గత రెండు వారాలుగా అక్కడ రోజుకు 35 నుంచి 40 వేల పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. యూరప్‌లో కొవిడ్ తీవ్రతను అతి ఎక్కువగా ఎదుర్కొన్న దేశాల్లో బ్రిటన్ ఒకటి. అనేక చర్యల అనంతరం ఉపశమనం దొరికిందని అనుకునే లోపే మహమ్మారి పంజా విసిరింది.


సోమవారం బ్రిటన్‌లో ఏకంగా 50 వేల కేసులకు చేరువయ్యాయి. మార్చి ముగింపు నుంచి రోజులకు 100 మంది చొప్పున బ్రిటనర్లు కొవిడ్ కారణంగా చనిపోతున్నారు. మొత్తం మరణాల సంఖ్యలో యూరప్‌లో రష్యా తర్వాత బ్రిటన్ రెండో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు బ్రిటన్‌లో 1.38 లక్షల మంది కొవిడ్ కారణంగా చనిపోయారు. ఇతర దేశాలతో పోలిస్తే బ్రిటన్‌లో కొవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉందని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జిమ్ నెయిస్మిత్ ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-10-20T00:58:37+05:30 IST