మూడు నెలలుగా బాలికపై బాలుర గ్యాంగ్‌ రేప్‌

ABN , First Publish Date - 2021-12-28T06:36:47+05:30 IST

కర్ణాటక రాష్ట్రం ధార్వాడలోని ఒక ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న 16 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన కలకలం రేపుతోంది...

మూడు నెలలుగా బాలికపై బాలుర గ్యాంగ్‌ రేప్‌

బెంగళూరు, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): కర్ణాటక రాష్ట్రం ధార్వాడలోని ఒక ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న 16 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన కలకలం రేపుతోంది. ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు ఆదివారం ఆరుగురు బాలుర్ని అరెస్టు చేశారు. ప్రేమ పేరుతో బాలికకు వలవేసిన 17 ఏళ్ల బాలుడు తొలుత బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడని.. అనంతరం మరో ఐదుగురు స్నేహితులు తోడై పిక్నిక్‌ల పేరుతో పలు ప్రాంతాల్లో తిరుగుతూ 3 నెలలుగా ఈ బాలికపై సామూహిక అత్యాచారానికి ఒడి గట్టారని, ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించేవారని పోలీసులు వెల్లడించారు.


కొద్దిరోజులగా బాలిక అనారోగ్యంతో బాధపడతుండంతో తల్లిదండ్రులు వైద్యపరీక్ష చేయించగా అత్యాచార ఘటన వెలుగు చూసినట్లు తెలిసింది. షాక్‌కు గురైన తలిదండ్రులు ధార్వాడ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలిక ఇచ్చిన సమాచారం ఆధారంగా అత్యాచారానికి పాల్పడ్డ ఆరుగురు బాలుర్ని అరెస్టు చేశామని, చేసిన నేరాన్ని బాలురు అంగీకరించారని పోలీసులు వెల్లడించారు. 

Updated Date - 2021-12-28T06:36:47+05:30 IST