ఆర్యన్‌కు హైకోర్టు విధించిన బెయిలు షరతులివే...
ABN , First Publish Date - 2021-10-29T22:27:12+05:30 IST
క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్, మరో ఇద్దరికి బెయిల్ మంజూరు చేసిన ముంబై హైకోర్టు..

ముంబై: క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్, మరో ఇద్దరికి బెయిల్ మంజూరు చేసిన ముంబై హైకోర్టు శుక్రవారంనాడు బెయిల్ షరతులతో కూడిన 5 పేజీల ఆపరేటివ్ ఆర్డర్స్‌ను విడుదల చేసింది. ఆర్యన్ ఖాన్‌తో పాటు సహ నిందుతులైన అర్బాజ్ మర్చంట్, మునుమున్ థమేఛాలకు కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఒక్కొక్కరు రూ.లక్ష రూపాయలు విలువచేసే పూచీకత్తు, అంతే మొత్తానికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ష్యూరిటీలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. తాజాగా షరతులతో కూడిన ఆపరేటివ్ ఆర్డర్స్‌ను విడుదల చేసింది.
ఆర్యన్‌తో పాటు సహ నిందితులు ఎవరూ కూడా ముందస్తు అనుమతి తీసుకోకుండా దేశాన్ని విడిచి వెళ్లరాదని, కోర్టు ప్రొసీడింగ్స్ గురించి మీడియా ముందు ఎలాంటి ప్రకటనలు చేయరాదని, ఐఓ అనుమతి లేకుండా ముంబై విడిచి బయటకు వెళ్లరాదని, ప్రతి శుక్రవారం ఎన్సీబీ ఆఫీసు ముందు హాజరుకావాలని ఆ ఆదేశాల్లో హైకోర్టు స్పష్టం చేసింది.