Delhi : రోహిణి కోర్టులో మరోసారి పేలుడు కలకలం.. రూమ్ నంబర్ 102లో ఘటన
ABN , First Publish Date - 2021-12-09T17:47:21+05:30 IST
ఢిల్లీ రోహిణి కోర్టులో మరోసారి పేలుడు కలకలం రేపింది. ల్యాప్‌టాప్ పేలినట్టు పోలీసులు చెబుతున్నారు.

ఢిల్లీ : ఢిల్లీ రోహిణి కోర్టులో మరోసారి పేలుడు కలకలం రేపింది. ల్యాప్‌టాప్ పేలినట్టు పోలీసులు చెబుతున్నారు. ఒక వ్యక్తి కాలికి గాయమైనట్లు వెల్లడించారు. రూమ్ నంబర్ 102లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఏం జరిగిందో తెలియక భయంతో కోర్టులోని వారు పరుగులు తీశారు. ఘటనా స్థలాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
కాగా.. గతంలోనూ ఇదే కోర్టు కాల్పుల ఘటన కలకలం రేపింది. అయితే అప్పుడు ఓ నిందితుడిని హతమార్చడంలో భాగంగా కాల్పులు జరిగాయి. రూమ్ నెంబర్ 207లో జరిగిన కాల్పుల్లో నలుగురు చనిపోయారు. ఈ ఘటనలో గ్యాంగ్‌స్టర్ జితేంద్ర గోగితోపాటు మరో ముగ్గురు చనిపోయారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రెండు గ్యాంగ్‌ల మధ్య విభేదాలే ఈ ఘటనకు కారణమని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. కోర్టుకు వచ్చిన జితేంద్ర టార్గెట్‌గా ఈ కాల్పులు జరిగాయి. అడ్వాకేట్ యూనిఫారమ్స్‌లో వచ్చిన ఇద్దరు ప్రత్యర్థులు కాల్పులకు తెగబడ్డారు. గోగిపై కాల్పులు జరిపారు. అప్రమత్తమైన పోలీసులు కూడా కాల్పులు జరిపారు.