వర్చువల్ ప్రచారానికి బీజేపీ రెడీ: షెకావత్
ABN , First Publish Date - 2021-12-30T07:40:41+05:30 IST
ఎన్నికల ప్రచారాలను వర్చువల్‌గా నిర్వహించేందుకు తమపార్టీ సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు ..

న్యూఢిల్లీ, డిసెంబరు 29: ఎన్నికల ప్రచారాలను వర్చువల్‌గా నిర్వహించేందుకు తమపార్టీ సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు గజేంద్ర షెకావత్ స్పష్టంచేశారు. దేశంలో ఒమైక్రాన్ కేసులు పెరుగుతున్నందున త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను, పార్టీల ప్రచార సభలను వాయిదా వేసుకునే అంశాన్ని పరిశీలించాలంటూ ప్రధాని మోదీ, కేంద్ర ఎన్నికల సంఘానికి ఇటీవల అలహాబాద్ హైకోర్టు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.