కుమారుడికి మంత్రి పదవి ఇవ్వలేదని యూపీ నిషాద్ పార్టీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-07-08T18:10:16+05:30 IST

కేంద్ర మంత్రివర్గ విస్తరణ అనంతరం బీజేపీ మిత్రపక్షంలో అసమ్మతి రాజుకుంది....

కుమారుడికి మంత్రి పదవి ఇవ్వలేదని యూపీ నిషాద్ పార్టీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

గోరఖ్‌పూర్ (ఉత్తరప్రదేశ్): కేంద్ర మంత్రివర్గ విస్తరణ అనంతరం బీజేపీ మిత్రపక్షంలో అసమ్మతి రాజుకుంది. బీజేపీ మిత్రపక్షమైన యూపీ నిషాద్ పార్టీ చీఫ్ సంజయ్ నిషాద్ తన కుమారుడైన, ఎంపీ ప్రవీణ్ నిషాద్‌ను పునర్వ్యవస్థీకరణలో భాగంగా కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోకపోవడంపై నిరాశ వ్యక్తం చేశారు.అప్నా దళ్ పార్టీకి చెందిన అనుప్రియా పటేల్‌ను కేంద్ర మంత్రుల మండలిలో చేర్చినా, ప్రవీణ్ నిషాద్ ను మంత్రిని ఎందుకు చేయలేదని సంజయ్ ప్రశ్నించారు.‘‘నిషాద్ వర్గ ప్రజలు ఇప్పటికే బీజేపీని తరిమికొడుతున్నారు... పార్టీ తన తప్పులను సరిదిద్దుకోకపోతే, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పర్యవసానాలను ఎదుర్కోవలసి ఉంటుందని సంజయ్ హెచ్చరించారు. 


ప్రవీణ్ నిషాద్ 160 కి పైగా సీట్లలో ప్రజాదరణ పొందారని,కాని అనుప్రియా పటేల్ కు కేవలం కొన్ని అసెంబ్లీ సీట్లలోనే మద్ధతు ఉందని సంజయ్ అన్నారు.తన అభిప్రాయాలను బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలియజేశానని చెప్పారు.‘‘ఇక వారి నిర్ణయం. అయితే, వారు ప్రవీణ్ నిషాద్ ను చూసుకుంటారని నాకు పూర్తి నమ్మకం ఉంది’’ అని సంజయ్ అన్నారు.


Updated Date - 2021-07-08T18:10:16+05:30 IST