మహిళా నేతతో BJP కీలక నాయకుడి అశ్లీల సంభాషణ.. యూ ట్యూబ్‌లో 15 వీడియోలు.. ఇంతకీ అందులో ఏమున్నాయ్..!?

ABN , First Publish Date - 2021-08-25T15:13:24+05:30 IST

మహిళా నాయకురాలికి వీడియో కాల్‌ చేసి మాట్లాడుతున్న ...

మహిళా నేతతో BJP కీలక నాయకుడి అశ్లీల సంభాషణ.. యూ ట్యూబ్‌లో 15 వీడియోలు.. ఇంతకీ అందులో ఏమున్నాయ్..!?

  • జిల్లా నాయకురాలితో అశ్లీల సంభాషణ!
  • యూట్యూబ్‌లో వీడియో సంచలనం
  • బీజేపీ ప్రధాన కార్యదర్శి రాజీనామా

చెన్నై : బీజేపీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి కేటీ రాఘవన్‌ తన పార్టీకే చెందిన ఓ జిల్లాస్థాయి నాయకురాలితో జరిపిన అశ్లీల సంభాషణ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. దీంతో ఆయన తన పదవి కోల్పోవాల్సి వచ్చింది. ఇటీవలే బీజేపీలో చేరిన మదన్‌ రవిచంద్రన్‌ అనే పాత్రికేయుడే ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెట్టడం గమనార్హం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అనుమతి తీసుకునే ఈ వీడియోను విడుదల చేసినట్టు ఆయన చెప్పడం విశేషం. ఈ వీడియో విడుదలైన కొన్ని గంటల్లోపే కేటీ రాఘవన్‌ పార్టీ పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా రాఘవన్‌ తన ట్విట్టర్‌ పేజీలో ఓ సందేశం పోస్టు చేశారు. తాను మూడు దశాబ్దాలకు పైగా ఎలాంటి ఫలాపేక్ష లేకుండా పార్టీకి సేవ చేశానని, తానెలాంటి వాడినో రాష్ట్ర ప్రజలకు, తన సన్నిహితులందరికీ బాగా తెలుసని అందులో పేర్కొన్నారు. సామాజిక ప్రసార మాధ్యమాల్లో తనకు సంబంధించిన ఓ వీడియో మంగళవారం ఉదయం విడుదలైనట్టు తెలుసుకున్నానని, తనను తన పార్టీని కళంక పరిచేలా ఆ వీడియో విడుదలైందన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నా మలైని కలుసుకుని పార్టీ పదవికి రాజీనామా చేశానని వివరించారు.


ఇంతకీ ఆ వీడియోలో ఏముంది?

మంగళవారం మదన్‌ డైరీ శీర్షికతో ఆ పాత్రికేయుడు వెలువరించిన వీడియోలో కేటీ రాఘవన్‌ ఓ జిల్లా శాఖకు చెందిన మహిళా నాయకురాలికి వీడియో కాల్‌ చేసి మాట్లాడుతున్న దృశ్యాలున్నాయి. రాఘవన్‌ ఆ సమయంలో పూజగదిలో అర్ధనగ్నంగా సోఫాలో కూర్చుని ఆ మహిళతో మాట్లాడారు. తొలుత తనకు కాల్‌ చేయాలంటూ రాఘవన్‌ వాట్సాప్‌ సందేశాలు పంపించారు. ఆ తర్వాత ఆ మహిళ ఫోన్‌ చేయగా, రాఘవన్‌ తీయకుండా కాసేపయ్యాక ఆమెకు వీడియో కాల్‌ చేసి మాట్లాడే దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఆ మహిళతో సైగలు చేసి రాఘవన్‌ అడగటం, అందుకు ఆ మహిళ నిరా కరించటం వంటి దృశ్యాలున్నాయి.


15 వీడియోలున్నాయి..

ఈ వీడియోను విడుదల చేసిన పాత్రికేయుడు కొద్ది నెలల క్రితమే ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీలో చేరారు. రాష్ట్ర బీజేపీలో మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని తెలుసుకున్నా నని, ఇలాంటి వీడియోలు 15 వరకు తన వద్ద ఉన్నాయని, పార్టీలో ‘మిస్టర్‌ క్లీన్‌’ అని పేరుతెచ్చుకున్నాడు కనుకనేకేటీ రాఘవన్‌ వీడియోను విడుదల చేశానని ఆ పాత్రికేయుడు తెలిపారు. చెన్నై పరిసర జిల్లాలకు చెందిన వీడియోలు కూడా తన వద్ద ఉన్నాయని వెల్లడించారు.


చట్టప్రకారం ఎదుర్కొంటారు..

బీజేపీ ప్రధాన కార్యదర్శి కేటీ రాఘవన్‌ వీడియో వివాదాన్ని చట్ట ప్రకారం ఎదుర్కొని తన నిజాయతీని నిరూపించుకుంటారని ఆ పార్టీ రాష్ట్ర  అధ్యక్షుడు అన్నామలై తెలిపారు. రాఘవన్‌ తన పదవికి రాజీనామా చేసిన తర్వాత అన్నామలై ఓ ప్రకటన విడుదల చేశారు. వీడియో రిలీజ్‌ చేసిన యూ ట్యూబర్‌ మదన్‌ రవిచంద్రన్‌ తనను రెండుసార్లు కలిసి పార్టీలో కీలకమైన పదవుల్లో ఉన్నవారికి సంబంధించిన వీడియో ఆధారాలు తన వద్ద ఉన్నాయని, వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారని,  వాస్తవాలు తెలియకుం డా విచారణ జరుపకుండా ఎలా చర్యలు తీసుకోగలనని తాను చెప్పానన్నారు. వీడియో ఆధారాలను తనకు అందజేస్తే విచారించి నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చినా రవిచంద్రన్‌ పట్టించుకోలేదన్నారు. మూడో సారి రవిచంద్రన్‌ ఆ వీడియోను విడుదల చేస్తూ.. తనకు న్యాయం జరు గుతుందా? చర్యలు తీసుకుంటారా? తక్షణ చర్యలు తీసుకోకపోతే వీడియోను విడుదల చేస్తానని సెల్‌ఫోన్‌లో తనకు సందేశం పంపారని, రెండుసార్లు వీడియో ఆధారాలివ్వాలని కోరినా పట్టించుకోకుండా ఆరోపణలు ఏమిటో తెలియకుండా పార్టీ పరంగా తానెలాంటి చర్యలు తీసుకోగలనని స్పష్టం చేయడంతో పాటు ‘మీ ఇష్ట ప్రకారమే చేసుకోండి’ అంటూ బదులిచ్చానని అన్నామలై తెలిపారు.

Updated Date - 2021-08-25T15:13:24+05:30 IST