బెంగాల్ పోల్స్: అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన బీజేపీ

ABN , First Publish Date - 2021-03-14T22:59:58+05:30 IST

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్న బీజేపీ మూడు, నాలుగు దశల ఎన్నికలకు

బెంగాల్ పోల్స్: అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన బీజేపీ

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్న బీజేపీ మూడు, నాలుగు దశల ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితాలను విడుదల చేసింది. మూడో దశలో బరిలోకి దిగనున్న 27 మంది, నాలుగో దశకు సంబంధించి 36 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. గాయకుడి నుంచి రాజకీయ నేతగా ఎదిగిన కేంద్రమంత్రి బాబుల్ సుప్రియోకు టోలీగంజ్ నియోజకవర్గాన్ని కేటాయించింది. స్వపన్ దాస్‌గుప్తా తారకేశ్వర్ నుంచి బరిలోకి దిగనున్నట్టు బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటించారు. 


ఆర్థికవేత్త అశోక్ లాహిరి అలీపుర్దూర్ నుంచి, రజీబ్ బెనర్జీ దోమ్జూర్ నుంచి పోటీ చేయనుండగా,  సింగూర్ నుంచి రబీంద్రనాథ్ భట్టాచార్య, ఎంపీ నిశిత్ ప్రమాణిక్ దిన్హాతా నుంచి, నటుడు యశ్ దాస్‌గుప్తా చండితల నుంచి పోటీ చేయనున్నారు.

Updated Date - 2021-03-14T22:59:58+05:30 IST