సమాజ్‌వాదీ పార్టీలోకి బీజేపీ ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-10-31T08:03:44+05:30 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేతో పాటు మరో ఆరుగురు బీఎస్పీ బహిష్కృత ఎమ్మెల్యేలు సమాజ్‌వాదీ పార్టీలో చేరారు

సమాజ్‌వాదీ పార్టీలోకి బీజేపీ ఎమ్మెల్యే

  • ఆరుగురు బీఎస్పీ బహిష్కృత ఎమ్మెల్యేలు కూడా చేరిక


లఖ్‌నవూ, అక్టోబరు 30: ఉత్తర్‌ప్రదేశ్‌లో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేతో పాటు మరో ఆరుగురు బీఎస్పీ బహిష్కృత ఎమ్మెల్యేలు సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ సమక్షంలో శనివారం వీరంతా ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా  అఖిలేశ్‌ మాట్లాడుతూ.. బీజేపీ పాలన పట్ల ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, భవిష్యత్తులో ఆ పార్టీ కనుమరుగైపోవడం ఖాయమన్నారు. కాగా, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మరో మంత్రి అజయ్‌ మిశ్రాతో వేదిక పంచుకోవడంపై అఖిలేశ్‌ మండిపడ్డారు. శుక్రవారం లఖ్‌నవూలో జరిగిన ఓ కార్యక్రమంలో వీరిద్దరూ పాల్గొ న్న ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. బైనాక్యులర్లు పెట్టుకుని చూసినా యూపీలో నేర చరిత్ర కలిగిన రాజకీయ నేతలు కనిపించరని అమిత్‌షా ఆ కా ర్యక్రమంలో మాట్లాడారు. దీనిపై అఖిలేశ్‌ శనివారం స్పందించారు. ‘నకిలీ బైనాక్యులర్లు పె ట్టుకుని వెతుకుతున్నట్టు నటించొద్దు.. వెతుకుతు న్న వ్యక్తి మీ పక్కనే ఉన్నారు’ అని అజయ్‌ మిశ్రాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.  

Updated Date - 2021-10-31T08:03:44+05:30 IST