వారాణసీ, అయోధ్య, మథురలో బీజేపీకి షాక్‌

ABN , First Publish Date - 2021-05-05T07:37:15+05:30 IST

ఉత్తరప్రదేశ్‌ జిల్లా పంచాయతీ ఎన్నికల్లో కీలక స్థానాల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీకి ఆధిక్యం వచ్చినా ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారాణసీలో బీజేపీ ఓడిపోయింది...

వారాణసీ, అయోధ్య, మథురలో బీజేపీకి షాక్‌

  • యూపీ జడ్పీ ఎన్నికల్లో ఆ స్థానాల్లో ఓటమి

వారాణసీ/అయోధ్య, మే 4: ఉత్తరప్రదేశ్‌ జిల్లా పంచాయతీ ఎన్నికల్లో కీలక స్థానాల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీకి ఆధిక్యం వచ్చినా ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారాణసీలో బీజేపీ ఓడిపోయింది. 40 సీట్లున్న వారాణసీలో బీజేపీకి 8 స్థానాలే దక్కగా.. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) 15 స్థానాల్లో గెలిచింది. బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ)కి 5, అప్నా దళ్‌కు 3, సుహెల్దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీకి ఒకటి, ఇండిపెండెంట్లకు 8 సీట్లు దక్కాయి. 40 సీట్లున్న అయోధ్యలోనూ కమలం పార్టీ 9 స్థానాల్లోనే గెలిచింది. ఇక్కడ ఎస్పీ 17 చోట్ల గెలవగా.. బీఎస్పీకి 4, స్వతంత్రులు 10 స్థానాల్లో గెలిచారు. అలాగే 33 సీట్లున్న మథురలోనూ బీజేపీ 8 సీట్లే సాధించింది. ఇక్కడ బీఎస్పీ 13 స్థానాల్లో గెలవగా.. రాష్ట్రీయ లోక్‌దళ్‌, ఎస్పీ చెరో సీటును దక్కించుకున్నాయి. మిగతా చోట్ల ఇండిపెండెంట్లు విజయం సాధించారు. 


Updated Date - 2021-05-05T07:37:15+05:30 IST