బీజేపీ..కామరాజ్‌ జపం

ABN , First Publish Date - 2021-03-14T08:03:03+05:30 IST

‘ఉత్తర భారత పార్టీ’ ముద్రను చెరిపేసుకునేందుకు బీజేపీ తమిళనాట రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. తమిళుల చేత, ‘మనపార్టీ’ అనిపించుకునేందుకు అన్ని రకాలుగానూ కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే దివంగత ముఖ్యమంత్రులు

బీజేపీ..కామరాజ్‌ జపం

ఎంజీఆర్‌.. జయలలితల స్తుతి కూడా


చెన్నై-ఆంధ్రజ్యోతి: ‘ఉత్తర భారత పార్టీ’ ముద్రను చెరిపేసుకునేందుకు బీజేపీ తమిళనాట రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. తమిళుల చేత, ‘మనపార్టీ’ అనిపించుకునేందుకు అన్ని రకాలుగానూ కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే దివంగత ముఖ్యమంత్రులు కామరాజ్‌(కాంగ్రెస్‌), ఎంజీఆర్‌, జయలలిత(అన్నాడీఎంకే)ల పేర్లను ఆ పార్టీ నేతలు జపిస్తున్నారు. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం ఆ ముగ్గురి విగ్రహాలకు అంజలి ఘటించడంతోపాటు, వారి బాటలో పయనిస్తామని పలు బహిరంగసభల్లో ప్రకటించారు. అయితే బీజేపీ నేతల తీరును టీఎన్‌సీసీ నేతలు ఖండించారు. బీజేపీకి రాష్ట్రంలో తమ నేతలంటూ చెప్పుకునేందుకు ఎవరూ లేక, కాంగ్రెస్‌ నేత పేరు స్తుతిస్తోందంటూ ఎద్దేవా చేస్తున్నారు. 

Updated Date - 2021-03-14T08:03:03+05:30 IST