పశ్చిమ బెంగాల్‌లో డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ అభ్యర్థులు

ABN , First Publish Date - 2021-11-03T00:08:54+05:30 IST

పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ దెబ్బకు బీజేపీ కుదేలైంది. ఉప ఎన్నికలు జరిగిన నాలుగు

పశ్చిమ బెంగాల్‌లో డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ అభ్యర్థులు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ దెబ్బకు బీజేపీ కుదేలైంది. ఉప ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాల్లోనూ ఓటమి పాలైంది. ఈ ఎన్నికల్లో మొత్తం మూడు చోట్ల బీజేపీ డిపాజిట్ కోల్పోయింది. ఇదే విషయాన్ని టీఎంసీ రాజ్యసభ సభ్యుడు డెరిక్ ఒబ్రెయిన్ ట్వీట్ చేస్తూ బీజేపీని ఎద్దేవా చేశారు.


ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఓడిపోవడమే కాదు, సెక్యూరిటీ డిపాజిట్ కూడా కోల్పోయారని విమర్శించారు. మొత్తం నాలుగు స్థానాల్లో మూడు చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారన్నారు. అంతేకాదు, రెండు మూడు స్థానాల కోసం బీజేపీ, సీపీఎం మధ్య హోరాహోరీ పోరు జరిగిందన్నారు.  


ఈ ఏడాది మేలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో దిన్హాటా స్థానాన్ని స్వల్ప మెజారిటీతో బీజేపీ చేజిక్కించుకున్న విషయాన్ని ఒబ్రెయిన్ గుర్తు చేస్తూ.. ఈసారి దిన్హాటాలో విజయం సాధించిన టీఎంసీ, ఓడిపోయిన బీజేపీ మధ్య ఓట్ల తేడా 1.5 లక్షలకు పైనే ఉందని పేర్కొన్నారు.


టీఎంసీ గెలుపొందిన నాలుగు స్థానాల్లోనూ ఆ పార్టీకి 75 శాతానికి పైగానే ఓట్లు రావడం విశేషం. బీజేపీ కేవలం 14.48 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. కాగా, ఈ ఏడాది మేలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన దిన్హాటా, శాంతిపూర్ సీట్లను ఈసారి బీజేపీ కోల్పోగా, గోసాబా, కార్దాహా స్థానాలను టీఎంసీ నిలుపుకుంది. 

Updated Date - 2021-11-03T00:08:54+05:30 IST