ఇదేం బర్త్ డే పార్టీ?: మాస్కులు పెట్టుకోలేదు కానీ తుపాకులు పట్టుకొచ్చారు!

ABN , First Publish Date - 2021-05-21T23:31:37+05:30 IST

కరోనా కట్టడికి ప్రభుత్వం పలు ఆంక్షలు అమలు చేస్తోంది. మాస్కు ధరించకుండా బయటకు వచ్చే వారిని పోలీసులు చావగొడుతున్నారు. కూరగాయాలు

ఇదేం బర్త్ డే పార్టీ?: మాస్కులు పెట్టుకోలేదు కానీ తుపాకులు పట్టుకొచ్చారు!

భోపాల్: మధ్యప్రదేశ్‌లో కరోనా కట్టడికి ప్రభుత్వం పలు ఆంక్షలు అమలు చేస్తోంది. మాస్కు ధరించకుండా బయటకు వచ్చే వారిని పోలీసులు చావగొడుతున్నారు. కూరగాయాలు కొనేందుకు కుమార్తెతో కలిసి వచ్చిన ఓ మహిళ మాస్క్ ధరించలేదన్న కారణంతో పోలీసులు చితకబాదారు. మహిళ అని కూడా చూడకుండా కిందపడేసితన్నారు. ఆమెపై విచక్షణ రహితంగా దాడిచేశారు. సాగర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. మహిళపై ఇష్టానుసారం దాడిచేసిన పోలీసు తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. 


తాజాగా, అదే రాష్ట్రంలో జరిగిన ఓ బర్త్ డే పార్టీకి సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. బిహిండ్ జిల్లాలో జరిగిన ఈ బర్త్ డే వేడుకకు వందలాదిమంది హాజరయ్యారు. వారిలో ఒక్కరంటే ఒక్కరు కూడా మాస్కు పెట్టుకోలేదు సరికదా, చాలామంది చేతుల్లో తుపాకులు ఉన్నాయి. వారు తుపాకులు గాలిలో ఊపడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. స్థానిక నేత రాజేశ్ బఘేల్ తన కుమారుడి కోసం ఈ పార్టీ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత పోలీసులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. 


మాస్క్ ధరించనందుకు ఓ మహిళపై విచక్షణ రహితంగా దాడిచేసిన పోలీసులు ఈ బర్త్ డే పార్టీకి హాజరైన వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. పార్టీకి హాజరైన వారిలో ఒక్కరు కూడా మాస్క్ ధరించలేదని, పైగా తుపాకులు పట్టుకొచ్చిన వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. స్పందించిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

Updated Date - 2021-05-21T23:31:37+05:30 IST