ఒక్కసారన్నా కుల ప్రాతిపదికన జనగణన జరగాలి: బీహార సీఎం
ABN , First Publish Date - 2021-07-25T05:13:53+05:30 IST
రాష్ట్రంలో ఒక్కసారన్నా కులం ప్రాతిపదికన జనగణన జరగాలని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఇలా లభించే సమాచారం ప్రజల అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.

పట్నా: రాష్ట్రంలో ఒక్కసారన్నా కులం ప్రాతిపదికన జనగణన జరగాలని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఇలా లభించే సమాచారం ప్రజల అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ‘‘కుల ప్రాతిపదికన జరిగే జనగణన ద్వారా ఒక్కో కులం వారి జనాభా ఎంతో కచ్చితంగా తెలుస్తుంది. కులాల వారీగా జనాభా ఎంతో తెలిస్తే ఆయాల వర్గాల అభివృద్ధికి ప్రణాళికలు వేయచ్చు’’ అని నితీశ్ పేర్కొన్నారు. 2011లో కేంద్రం ప్రభుత్వం సామాజిక, ఆర్థిక స్థితిగతులు, కులం ఆధారంగా ఓమారు జనగణన జరిపింది. గ్రామీణప్రాంతాల్లో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో, పట్టణ ప్రాంతాల్లో కేంద్ర పట్టణ పేదరికనిర్మూలన శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ పూర్తయింది. అయితే..ఇందుకు సంబంధించి సామాజిక, ఆర్థిక స్థితిగతుల సమాచారాన్ని కేంద్రం ప్రచురించింది.