నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-02-01T13:45:42+05:30 IST

బీహార్ బోర్టు ఇంటర్ పరీక్షలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా సమయంలో...

నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం

పట్నా: బీహార్ బోర్టు ఇంటర్ పరీక్షలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా సమయంలో బీహార్‌లోనే తొలిసారిగా బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షల సందర్భంగా విద్యార్థులు షూస్ వేసుకుని రావాలన్న నిబంధనకు సడలింపునిచ్చారు. అయితే పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీలను అమర్చారు. వీటి ద్వారా పరీక్షల తీరుతెన్నులను పర్యవేక్షించనున్నారు. ప్రతీ ఐదువందల మంది విద్యార్థులకు ఒక వీడియోగ్రాఫర్ ఉండనున్నారు.


పది నిముషాల ముందుగా విద్యార్థులను పరీక్షా గదులలోకి అనుమతించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు నుంచి 1473 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 13 లక్షల, 50 వేల, 233 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 25 మంది పరీక్షార్థులకు ఒక ఇన్విజిలేటర్ ఉండనున్నారు. పరీక్షల నిర్వహణకు బీహార్ ఎడ్యుకేషన్ బోర్డు ఒక వాట్సాప్ గ్రూప్ కూడా రూపొందించింది. దీని సాయంతో డీఈవో, డీఎంలు పరీక్షలను పర్యవేక్షించనున్నారు. ఉదయం 9:30 నుంచి 12:45 వరకూ, సాయంత్రం 1:45 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పరీక్షలు జరగనున్నాయి.

Updated Date - 2021-02-01T13:45:42+05:30 IST