సురుటుపల్లి ఆలయంలో గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ పూజలు

ABN , First Publish Date - 2021-07-12T13:56:33+05:30 IST

రాష్ట్ర గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ ఊత్తుకోట సమీపం సురుటుపల్లిలోని శ్రీసర్వమంగళ సమేత పల్లికొండేశ్వరస్వామివారి ఆలయాన్ని ఆదివారం సాయంత్రం దర్శించారు

సురుటుపల్లి ఆలయంలో గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ పూజలు

చెన్నై: రాష్ట్ర గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ ఊత్తుకోట సమీపం సురుటుపల్లిలోని శ్రీసర్వమంగళ సమేత పల్లికొండేశ్వరస్వామివారి ఆలయాన్ని ఆదివారం సాయంత్రం దర్శించారు. ఆలయ చైర్మన్‌ మునిశేఖర్‌రెడ్డి, తిరుపతి ఆర్డీవో  కనకనరసారెడ్డి, ఆలయ ఈఓ రవీంద్రరాజ్‌ తదితరులు గవర్నర్‌కు స్వాగతం పలికారు. స్వామివారిని, ప్రదోష నందీశ్వరుని గవర్నర్‌ దర్శించుకున్నారు. ఆలయ కుడ్యంలోని దక్షిణామూర్తి శిల్పాన్ని కూడా తిలకించి గర్భాలయాన్ని ప్రదక్షిణ చేశారు. ఆ తర్వాత ఆలయ వేదపండితులు గవర్నర్‌కు ఆశీర్వచనాలు పలికారు. ఆలయ ప్రసాదాలు స్వీకరించిన మీదట గవర్నర్‌ చెన్నైకి కారులో బయల్దేరారు. 

Updated Date - 2021-07-12T13:56:33+05:30 IST