పెరిగిన రేట్లతో బెంగుళూరు వాసుల బెంబేలు

ABN , First Publish Date - 2021-11-09T16:27:13+05:30 IST

కేంద్రం ఒకవైపు ప్రజలపై భారం మోపుతుండగా.. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఆ మార్గంలోనే పయనిస్తున్నాయి. తాజాగా కర్ణాటక ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది.

పెరిగిన రేట్లతో బెంగుళూరు వాసుల బెంబేలు

బెంగుళూరు: కేంద్రం ఒకవైపు ప్రజలపై భారం మోపుతుండగా.. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఆ మార్గంలోనే పయనిస్తున్నాయి. తాజాగా కర్ణాటక ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. బెంగుళూరు వాసులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూసే. ఇప్పటికే బెంగుళూరు అంటేనే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. ఇక బెంగుళూరులో ఆటో రిక్షా ప్రయాణ ఖర్చులు పెంచాలని కర్ణాటక ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ నిర్ణయించింది. ప్రస్తుతం మొదటి రెండు కిలో మీటర్లకు రూ.25 చార్జ్ చేస్తుండగా.. దానిని రూ.30కి పెంచాలని నిర్ణయించారు. ఇక రెండు కిలో మీటర్ల తర్వాత నుంచి ప్రతి కిలో మీటర్‌కు రూ.15 చార్జ్ చేయనున్నారు. 


అలాగే హోటల్, రెస్టారెంట్ ఓనర్లు సైతం సోమవారం నుంచి ఆహార పదార్థాలపై కనీసం 10 శాతం ధరలు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై స్పందించిన రెస్టారెంట్ యాజమాన్యాలు. కమర్షియల్ గ్యాస్ ఎల్‌పీజీ, నూనె ధరలు, కూరగాయల ధరలూ ఆకాశాన్నంటుతున్న ఈ తరుణంలో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదన్నారు. Updated Date - 2021-11-09T16:27:13+05:30 IST