బెంగళూరు, తుమకూరులో పెరిగిన Covid కేసులు
ABN , First Publish Date - 2021-10-29T16:29:03+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ కేసులు మరోసా రి పెరిగాయి. గురువారం 478 మందికి పాజిటివ్ ని ర్ధారణ కాగా బెంగళూరులో 235 మందికి, తుమకూరు 53, మైసూరు 47 మందికి పాజిటివ్ ప్రబలింది. 11 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు
బెంగళూరు(Karnataka): రాష్ట్రంలో కొవిడ్ కేసులు మరోసా రి పెరిగాయి. గురువారం 478 మందికి పాజిటివ్ ని ర్ధారణ కాగా బెంగళూరులో 235 మందికి, తుమకూరు 53, మైసూరు 47 మందికి పాజిటివ్ ప్రబలింది. 11 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 334 మంది కోలుకోగా 17 మంది మృతి చెందారు. ఇటీవల నెల రోజుల్లో మృతుల సంఖ్య పెరిగినట్లయ్యింది. బెంగళూరులో ఏడుగురు, దక్షిణ కన్నడలో నలుగురు, కోలార్, మైసూరులలో ఇరువురి చొప్పున, హాసన్, రామనగర్‌లలో ఒక్కొక్కరు మృతి చెందారు. 24 జిల్లాల్లో ఒక్కరూ మృతిచెందలేదు. 30 జిల్లాల్లో 8557 మంది చికిత్స పొందుతున్నారు.