అప్పుడు సిగ్నల్ జంప్ చేస్తే.. జరిమానా ఉండదు: బెంగళూరు పోలీసులు!

ABN , First Publish Date - 2021-02-09T03:11:59+05:30 IST

మీరు నాలుగు రోడ్ల కూడలి వద్దకు బైక్‌పై వస్తున్నారు...ఇంతలో రెడ్ సిగ్నల్ పడింది. వెనుకేమో ఆంబులెన్స్..! దారివ్వాలన్న సైరన్ వినబడుతోంది. తప్పనిసరి పరిస్థితుల్లో అంబులెన్స్‌కు దారిచ్చేందుకు మీరు సిగ్నల్ జంప్ చేస్తారు..ఓకే.. ఇప్పుడు మీకో ప్రశ్న..?ఇలా చేసినందుకు మీకు జరిమానా పడుతుందా..? ఏంటీ చెప్పలేకపోతున్నారా..? ఏం పర్లేదు.. ఎందుకంటే.. ఈ సందర్భాల్లో ఎటువంటి జరిమానా విధించబోమని తాజాగా బెంగళూరు పోలీసుల ప్రకటించారు.

అప్పుడు సిగ్నల్ జంప్ చేస్తే.. జరిమానా ఉండదు: బెంగళూరు పోలీసులు!

బెంగళూరు: మీరు నాలుగు రోడ్ల కూడలి వద్దకు బైక్‌పై వస్తున్నారు...ఇంతలో రెడ్ సిగ్నల్ పడింది. వెనుకేమో ఆంబులెన్స్..! దారివ్వాలన్న సైరన్ వినబడుతోంది. తప్పనిసరి పరిస్థితుల్లో అంబులెన్స్‌కు దారిచ్చేందుకు మీరు సిగ్నల్ జంప్ చేస్తారు..ఓకే.. ఇప్పుడు మీకో ప్రశ్న..?ఇలా చేసినందుకు మీకు జరిమానా పడుతుందా..? ఏంటీ చెప్పలేకపోతున్నారా..? ఏం పర్లేదు.. ఎందుకంటే.. ఈ సందర్భాల్లో ఎటువంటి జరిమానా విధించబోమని తాజాగా బెంగళూరు పోలీసుల ప్రకటించారు. అవును..సమాచారహక్కు కార్యకర్త అమరేష్ అడిగిన ప్రశ్నకు బెంగళూరు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ లేఖ ద్వారా ఈ మేరకు సమాధానమిచ్చారు. అమెరేష్ కూతురు గతంలో మూడు సార్లు సిగ్నల్ జంప్ చేశారు. అయితే..ఈ క్రమంలో రెండు పర్యాయాలు ఆమె చలానా కట్టాల్సి వచ్చింది. ఓ సందర్భంలో మాత్రం ఆమె చెప్పిన వివరణతో ఏకిభవించిన పోలీసులు చలానా విధించలేదు. అంబులెన్స్‌కు దారిచ్చేందుకే తాను సిగ్నల్ జంప్ చేయాల్సి వచ్చిందని అమె చెప్పడంతో పోలీసులు మినాహాయింపు నిచ్చారు. అయితే..ఈ విషయాన్ని ఆమె తండ్రికి చెప్పడంతో ఆయన జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌కు లేఖ రాశారు. ప్రాణాలు నిలిపే క్రమంలో అంబులెన్స్‌కు దారివ్వబోయిన బైకర్ల పరిస్థితిపై స్పష్టత ఇవ్వాలని కోరారు.  దీనిపై స్పందించింన జేసీపీ. ఇటువంటి సందర్భాల్లో జరిమానా కట్టక్కర్లేదంటూ సమాధానమిచ్చారు. 

Updated Date - 2021-02-09T03:11:59+05:30 IST